విద్యార్థులకు అలర్ట్.. అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా.. తిరిగి ఎప్పుడంటే?

by Ramesh Naini |

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

విద్యార్థులకు అలర్ట్.. అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా.. తిరిగి ఎప్పుడంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 న మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. వాయిదా పడ్డ డిగ్రీ మూడవ, రెండవ, మొదటి సంవత్సరం వేర్వేరు సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 17 నుంచి మార్చి 10 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొ. భోజు శ్రీనివాస్ తెలిపారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, పరీక్షలకు మూడు రోజుల ముందు విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.in లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు వారి సంబంధిత అధ్యయన కేంద్రంలో, లేదా వెబ్ సైట్ www.braou.ac.in లో సంప్రదించవచ్చని సూచించారు.

Next Story