టెస్టు ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి చేరుకున్న బ్రాడ్

by  |
టెస్టు ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి చేరుకున్న బ్రాడ్
X

దిశ, స్పోర్ట్స్: విజ్టెన్ ట్రోఫీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఐసీసీ ర్యాకింగ్స్‌లో దూసుకెళ్లాడు. విండీస్‌తో జరిగిన మూడో టెస్టులో 10 వికెట్లు తీయడంతో 3వ ర్యాంకుకు చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో గెలిచి విస్డెన్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

మాంచెస్టర్ మ్యాచ్ కంటే ముందు 10వ ర్యాంకులో ఉన్న బ్రాడ్ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి 3వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు వేగంతో 45 బంతుల్లో 62 పరుగులు చేశాడు. దీంతో ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో 11వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాట్ సిమన్స్ 904 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత పేసర్ జస్ప్రీత్ బూమ్రా ఒక ర్యాంగు తగ్గి 8కి చేరుకున్నాడు.


Next Story

Most Viewed