స్టువర్ట్ బ్రాడ్‌కు తండ్రి ఫైన్

by  |
స్టువర్ట్ బ్రాడ్‌కు తండ్రి ఫైన్
X

దిశ, స్పోర్ట్స్ : స్టువర్ట్ బ్రాడ్‌(Stuart Broad)కు తండ్రి ఫైన్ వేయడం ఏంటా అని అనుమానపడుతున్నారా? అవును నిజమే బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్(Chris Broad) ఫైన్(Fine) వేశాడు . కానీ అది తండ్రిగా కాదు మ్యాచ్ రిఫరీ(Match Referee)గా. పాకిస్తాన్‌(Pakistan)తో జరిగిన తొలి టెస్టు( first test)లో బ్రాడ్ ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌(ICC Code of Conduct)ను ఉల్లంఘించినందుకు (Violations) మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.

అతను లెవెల్ 1(Level 1) తప్పిదానికి పాల్పడినట్లు మ్యాచ్ రిఫరీ(Match Referee) క్రిస్ బ్రాడ్ గుర్తించి అతడికి జరిమానా విధించారు. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌(Second Innings) 46వ ఓవర్‌లో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్(Leg spinner) యాసిర్ షా(Yasir Shah)ను బ్రాడ్ పరుష పదజాలంతో(vulgar)దూషించాడు. సాధారణంగా ఇలాంటి తప్పులకు 50 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్(Two demerit) పాయింట్లు విధిస్తారు. అయితే బ్రాడ్ తన తప్పును ఒప్పుకోవడంతో శిక్షను తగ్గించారు. సాధారణంగా సొంత దేశానికి చెందిన వ్యక్తులు మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించరు. కానీ ప్రస్తుతం కోవిడ్(Kovid) మహమ్మారి నేపథ్యంలో అందరూ ఇంగ్లాండ్‌(England)కు చెందిన అధికారులే ఉండటంతో క్రిస్ బ్రాడ్ రిఫరీగా వ్యవహరిస్తున్నారు.


Next Story

Most Viewed