అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులదే : గవర్నర్ తమిళి సై

by  |
అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులదే : గవర్నర్ తమిళి సై
X

దిశ,బేగంపేట: శస్త్ర చికిత్సలు అంటే ప్రజలు భయపడతారని వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులదేనని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా శుక్రవారం సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో, ఫస్ట్ బైప్లేన్ క్యాథ్ ల్యాబ్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్ట్రోక్ లక్షణాలు, దాని ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్యుల పాత్ర ముఖ్యమని అన్నారు. స్ట్రోక్ వచ్చిన క్షణాల్లోనే ఆస్పత్రికి రావాలి, కానీ ఎక్కువ కేస్ లలో చాలా ఆలస్యంగా స్ట్రోక్ ని గుర్తిస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు కేవలం 50 నుంచి 60 ఏళ్ల వాళ్ళకే స్ట్రోక్ ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు 25 ఏళ్ల లోపు వారిలోను స్ట్రోక్ ఎక్కువగా ఉంటోందని చెప్పారు.

జీవన విధానంలో మార్పులు, టెన్షన్, స్ట్రెస్, బ్లడ్ ప్రెజర్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ కి ముఖ్య కారణం అవుతున్నాయని వెల్లడించారు. స్ట్రోక్ చికిత్సని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేర్చడం, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ లో పెట్టడంపై ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. యశోద హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరు కంటి మాట్లాడుతూ.. డైరెక్ట్ అన్ జియో సూట్ టెక్నాలజీతో పనిచేసే బై ప్లేస్ న్యూరో అంజి ప్రొసీజర్ సూట్ అత్యాధునిక ప్రపంచ స్థాయి టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకురావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో. సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కోమల్ కుమార్ . తో పాటు ఈరోజు న్యూరో జి లిస్ట్ డాక్టర్లు న్యూరో సర్జన్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed