- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిలోఫర్‌లో వింత శిశువు జననం
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో వింత శిశువు జన్మించింది. కాప్రాకు చెందిన సరళకు నెలలు నిండడంతో వారం క్రితం ప్రసవం కోసం నిలోఫర్ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఈ నెల 19న సిజేరియన్ చేయగా వింత శిశువుకు జన్మనిచ్చింది. రెండు కండ్లు మూసుకుపోయి, నోరు, పెదాలతో పాటు శరీరమంతా రక్తం గడ్డకట్టుకుపోయి ఉంది. రెండు కాళ్లకు వేళ్లు లేకపోవడం, చేతులకు చిన్నగా వేళ్లు ఉండి ముడుచుకుపోయి చూసేందుకు అందవికారంగా ఉంది. ‘హెర్లేక్వీన్ […]</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో వింత శిశువు జన్మించింది. కాప్రాకు చెందిన సరళకు నెలలు నిండడంతో వారం క్రితం ప్రసవం కోసం నిలోఫర్ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఈ నెల 19న సిజేరియన్ చేయగా వింత శిశువుకు జన్మనిచ్చింది. రెండు కండ్లు మూసుకుపోయి, నోరు, పెదాలతో పాటు శరీరమంతా రక్తం గడ్డకట్టుకుపోయి ఉంది. రెండు కాళ్లకు వేళ్లు లేకపోవడం, చేతులకు చిన్నగా వేళ్లు ఉండి ముడుచుకుపోయి చూసేందుకు అందవికారంగా ఉంది. ‘హెర్లేక్వీన్ ఇచియోసీస్’ అనే జన్యుపరమైన లోపంతో శిశువు జన్మించిందని, శిశువు ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. శిశువు తల్లి గతంలో కూడా నిలోఫర్‌లోనే వింత శిశువుకు జన్మనిచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు.
Next Story






