- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడం గారూ..టోటల్ సిటీ ఇలానే ఉందనుకునేరు!
<p> గవర్నర్ నివాసం కమ్ ఆఫీసు రాజ్ భవన్. ఆ రూట్లో సెంట్రల్ లైటింగ్ బ్రహ్మాండంగా ఉన్నది. రోడ్డు దీపాల వెలుగులు జిగేల్‌మంటుంటాయి. లైట్లే కాదు, స్తంభాలకూ కాంతులీనే కలర్‌ఫుల్ మడత తోరణాలే! అంతటి ఘనంగా కాకున్నా, సాధారణ సెంట్రల్ లైటింగ్ సరిగా లేని ఏరియాలు సిటీలో ఎన్నో. ఎగ్జాంపుల్‌గా చూస్తే, ప్యాట్నీ సెంటర్ మెయిన్ సర్కిల్. జూబ్లీ బస్ స్టేషన్ అక్కడికి చేరువలోనే. అట్లాంటి ప్లేసుల్లోనూ గుడ్డి దీపాలే దిక్కయ్యాయి. […]</p>

గవర్నర్ నివాసం కమ్ ఆఫీసు రాజ్ భవన్. ఆ రూట్లో సెంట్రల్ లైటింగ్ బ్రహ్మాండంగా ఉన్నది. రోడ్డు దీపాల వెలుగులు జిగేల్‌మంటుంటాయి. లైట్లే కాదు, స్తంభాలకూ కాంతులీనే కలర్‌ఫుల్ మడత తోరణాలే! అంతటి ఘనంగా కాకున్నా, సాధారణ సెంట్రల్ లైటింగ్ సరిగా లేని ఏరియాలు సిటీలో ఎన్నో. ఎగ్జాంపుల్‌గా చూస్తే, ప్యాట్నీ సెంటర్ మెయిన్ సర్కిల్. జూబ్లీ బస్ స్టేషన్ అక్కడికి చేరువలోనే. అట్లాంటి ప్లేసుల్లోనూ గుడ్డి దీపాలే దిక్కయ్యాయి. బట్టర్ ఫ్లై స్ట్రీట్ లైట్లు ఒక వైపు వెలిగితే, మరో వంక చీకటే. కొన్ని హైమాస్ట్ టవర్ లైట్లకైతే ఆ మాత్రమూ కరువే. అదంతా అంధకారమే. వాహనాల హెడ్ లైట్ల వెలుతురే ఒకింత ఆసరా. జన సంచారం ఎక్కువుండే ఏరియాలే ఇట్లుంటే, మరింక కాలనీల మాటో! సంపన్నులు, వీవీఐపీలు, వీఐపీల వీధులు, రహదారులు ఒకలా, పన్నులు చెల్లించే మామూలు జనం రాకపోకలు, ఆవాసాలుండే చోట్లలో ‘కారు’చీకట్లా? అంతేలే..అంతేలే!!






