మాటల్లో పెట్టి.. బట్టలు మాయం చేసి.. సినీ ఫక్కీ చోరీ..

by Batti.Sumithra |   (  Updated:2024-06-01 14:42:05  IST  )

<p>దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ బట్టల దుకాణంలో సినీ ఫక్కీలో చోరీ ఆలస్యంగా బయటపడింది. లోదుస్తులు విక్రయించే దుకాణానికి వెళ్లిన నలుగురు మహిళలు నిర్వాహకులను మాటల్లో పెట్టి చాకచక్యంగా బట్టలను దోచేశారు. ఈ ఘటన ఈ నెల 21న జరుగగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్న జాకీ బట్టల దుకాణంలో జరిగింది. ఆలస్యంగా తేరుకున్న బట్టల దుకాణం నిర్వాహకుడు […]</p>

మాటల్లో పెట్టి.. బట్టలు మాయం చేసి.. సినీ ఫక్కీ చోరీ..
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ బట్టల దుకాణంలో సినీ ఫక్కీలో చోరీ ఆలస్యంగా బయటపడింది. లోదుస్తులు విక్రయించే దుకాణానికి వెళ్లిన నలుగురు మహిళలు నిర్వాహకులను మాటల్లో పెట్టి చాకచక్యంగా బట్టలను దోచేశారు. ఈ ఘటన ఈ నెల 21న జరుగగా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్న జాకీ బట్టల దుకాణంలో జరిగింది. ఆలస్యంగా తేరుకున్న బట్టల దుకాణం నిర్వాహకుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతకు ముందు తన దుకాణాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, తగిన ఆధారాలను పోలీసులకు ఇవ్వడంతోపాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Next Story