పండుగ పూట విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

by  |
Good-News1
X

దిశ, వెబ్ డెస్క్: పండుగ పూట విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసి నర్సింగ్ విద్యార్థుల ఇంట దీపావళి వెలుగులు నింపింది. వారి స్టైఫెండ్ ను మూడింతలకు పెంచింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నది. స్టైపెండ్ పెంపుదల నర్సింగ్ స్కూల్స్, నిమ్స్ లో చదువుతున్న జీఎన్ఎం, బీఎస్సీ(నర్సింగ్) విద్యార్థులకు ఇది వర్తించనుంది. అదేవిధంగా ఎంఎస్సీ(నర్సింగ్) విద్యార్థులకు మొదటిసారిగా స్టైపెండ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అందులో పేర్కొన్నది. ఫస్టియర్ (ఎంఎస్సీ నర్సింగ్) విద్యార్థులకు నెలకు రూ. 9 వేలు, సెకండియర్ (ఎంఎస్సీ నర్సింగ్) విద్యార్థులకు రూ. 10 వేల స్టైపెండ్ అందనుంది.

Next Story

Most Viewed