- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారం జాగ్రత్త.. కొండముచ్చులున్నాయి
by Batti.Sumithra |
<p> సాధారణంగా కోతులైనా, కొండముచ్చులైనా ఇంట్లో దూరి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్తాయి. లేదా బట్టలు చిందరవందరగా చేసి వెళ్తాయి. కానీ ఈ కొండముచ్చులు మాత్రం ఇంట్లోని బంగారం ఎత్తుకెళ్లాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో చోటు చేసుకుంది. కొండముచ్చుకు బాగా ఆకలేసిందో.. ఏమో ఓ ఇంట్లో కిటికీ పక్కన ఉన్న గిన్నెను చేతిలో తీసుకుంది. ఇంట్లో వాళ్లు అప్రమత్తమై అరిచే సరికి గిన్నెను ఎత్తుకొని అవి పరుగు తీసాయి. ఇంటి పైకప్పు మీదకు […]</p>

X
సాధారణంగా కోతులైనా, కొండముచ్చులైనా ఇంట్లో దూరి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్తాయి. లేదా బట్టలు చిందరవందరగా చేసి వెళ్తాయి. కానీ ఈ కొండముచ్చులు మాత్రం ఇంట్లోని బంగారం ఎత్తుకెళ్లాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో చోటు చేసుకుంది. కొండముచ్చుకు బాగా ఆకలేసిందో.. ఏమో ఓ ఇంట్లో కిటికీ పక్కన ఉన్న గిన్నెను చేతిలో తీసుకుంది. ఇంట్లో వాళ్లు అప్రమత్తమై అరిచే సరికి గిన్నెను ఎత్తుకొని అవి పరుగు తీసాయి. ఇంటి పైకప్పు మీదకు వెళ్లి గిన్నెలో ఉన్న బంగారు ఆభరణాలను పదే పదే వాసన చూశాయి. గిన్నెలో ఉన్నది ఆహారం కాదని తేలడంతో.. బంగారు ఆభరణాలను ఆ గిన్నెలో వేసి.. ఇంటి కప్పు మీద వదిలేసి వెళ్లాయి. బంగారం తిరిగి దొరకడంతో ఆ ఇంట్లో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






