2021లో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్లు

by  |
2021లో తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా తెచ్చిన లాక్ డౌన్‌లో సెలబ్రిటీలందరూ రిలాక్స్ అయ్యారు. సినిమాలు, షూటింగ్స్ లేక టైమ్ పాస్ చేశారు. కానీ కొంతమంది మాత్రం పిల్లల్ని కనే పనిలో బిజీగా ఉన్నారు. 2020లో రాసిన ఎగ్జామ్‌కి రిజల్ట్ని 2021లో అందుకోబోతున్నారు ఈ స్టార్ పేరెంట్స్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి తమ ఫస్ట్ చైల్డ్‌కి జనవరి 11న పేరెంట్స్‌గా ప్రమోట్ అయ్యారు.

2021లో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ రెండోసారి పేరెంట్స్ అవుతున్నారు. బాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే బెబో.. రోండో సారి తల్లవుతున్నానంటూ ఆగస్ట్‌లో అనౌన్స్ చేసింది. ప్రెగ్నెన్సీ అనౌన్స్ మెంట్‌తో టాక్ ఆఫ్ ద టౌన్ అయిన కరీనా కపూర్ అప్పటినుంచి సోషల్ మీడియాలో ఫోటోలతో, వీడియోలతో హడావిడి చేస్తోంది.

నువ్వునేను సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇటు తెలుగు, అటు బాలీవుడ్‌లో బిజీ అయిపోయిన అనితా హస్సానందని, రోహిత్ రెడ్డి 2020 అక్టోబర్‌లో తమ కమింగ్ బేబీ గురించి అనౌన్స్ చేశారు. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో డెలివరీతో తల్లితండ్రులు కాబోతున్నారు.

ఇండియన్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరికా ఘట్కే జంట కూడా ఈ సంవత్సరమే పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్నారు. బాలీవుడ్ అప్ కమింగ్ యాక్టర్ నకుల్ మెహతా భార్య కూడా ఈ ఫిబ్రవరిలోనే బిడ్డ డెలివరీ కోసం వెయిట్ చేస్తోంది. ఇక 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న అదితి షిర్వైకర్, మోహిత్ మాలిక్ జంట కూడా రీసెంట్‌గానే తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. రాబోయే సమ్మర్‌లో మా బిడ్డను చూస్కోబోతున్నాం అంటున్నారు. ఇలా స్టార్ కపుల్స్ ఎప్పుడెప్పుడు పుట్టబోయే పిల్లల్ని చూస్కుందామా అంటూ తెగ ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed