ఈ నెల 7న స్టాలిన్ ప్రమాణ స్వీకారం..!

by  |
ఈ నెల 7న స్టాలిన్ ప్రమాణ స్వీకారం..!
X

చెన్నై: తమిళ‌నాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. మే7న సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించనున్నట్టు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం అనంతరం ఆయన మాట్లాడుతూ…తమకు ఇంతటి విజయాన్ని అందించిన తమిళ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం లేదనీ… ప్రమాణ స్వీకార తేదీని సోమవారం లేదా మంగళవారం ప్రకటిస్తామని తెలిపిన సంతగతి తెలిసిందే. కాగా డీఎంకే తరఫున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ మంగళవారం చెన్నైలో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed