జక్కన్న.. మహేశ్.. జంగిల్‌ యాక్షన్ అడ్వెంచర్

by  |
జక్కన్న.. మహేశ్.. జంగిల్‌ యాక్షన్ అడ్వెంచర్
X

దిశ, సినిమా: దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాతి ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతోనే అని కన్‌ఫర్మ్ చేశాడు. అప్పటి నుంచి స్టోరీ, షూటింగ్ షెడ్యూల్స్‌పై పలు అప్‌డేట్స్ రాగా.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం పీరియాడికల్ డ్రామాలు తీసిన జక్కన్న, మహేశ్‌తో ఫారెస్ట్ బేస్డ్ అడ్వెంచర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి కె.వి.విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథ పూర్తి చేసే పనిలో ఉన్నామని తెలపగా.. ఈ సినిమాతో పూర్తిగా కొత్త ప్రపంచాన్ని అన్వేషించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో చూడని విజువల్స్‌‌‌తో ఈ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ ఉండబోతోందని టాక్. ఫారెస్ట్ వరల్డ్‌లో సెట్ చేసిన కథలో యాక్షన్, థ్రిల్, డ్రామా ఫుల్ ప్యాకేజ్‌లో ఉండనుంది. కాగా లాక్‌డౌన్‌లో రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఈ స్టోరీపై వర్క్ చేయగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పూర్తికాగానే.. ఫైనల్ చేసి 2022 ప్రథమార్థంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.

ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఇప్పటి వరకు భారతీయ సినిమాల్లో టచ్ చేయని సబ్జెక్ట్ కాగా.. ఆడియన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ బాక్సాఫీస్ దగ్గర ట్రెమండస్ సక్సెస్ పొందాలనే ప్లాన్‌లో ఉన్నారు జక్కన్న అండ్ టీమ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ కాగానే.. ఆ తర్వాత జంగిల్ వరల్డ్‌ను వర్చువల్‌గా క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed