ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్..

by  |
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్..
X

దిశ, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ పీపుల్‌పై బూతు పురాణంతో విరుచుకుపడే శ్రీరెడ్డి.. తారక్ రాజకీయ ప్రవేశంపై పాజిటివ్ కామెంట్స్ చేయడం విశేషం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడో! రాడో! తెలియదు కానీ, వస్తే మాత్రం సీఎం అవుతారని అభిప్రాయపడింది. తెలుగు ప్రజలు అతన్ని సొంతకొడుకులా, అన్నలా చూసుకుంటారని తెలిపింది. టీమ్ తారక్ ట్రస్ట్ పేరుతో సేవ చేస్తున్న ప్రతీ తారక్ అభిమానికి కృతజ్ఞతలు తెలిపింది. మాస్ – క్లాస్.. డ్యాన్స్ – డైలాగ్ డెలివరీ.. నటన – నిజజీవితం ఏదైనా సరే తారక్ తర్వాతే అందరూ అంటూ పొగడ్తల్లో ముంచేసింది శ్రీరెడ్డి. ఆడవారిని అమ్మా! అని పిలిచే తారక్ సంస్కారానికి జీవితాంతం అభిమానిగా ఉంటానని ట్వీట్ చేసింది శ్రీరెడ్డి.


Next Story

Most Viewed