- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాలలో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు..
<p>దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల పరిధిలో భూ యాజమానిని బెదిరింపులకు గురిచేసిన కేసులో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురెడ్డి వంశీధర్ అనే వ్యక్తికి సంబంధించిన భూమిలోకి శ్రీరాంపూర్‌కు చెందిన సల్లూరి శంకర్ అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఈ భూమి తనదని వాదించాడు. అంతటితో ఆగకుండా అట్రాసిటీ కేసు పెడుతానని బెదిరించి తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో బాధితుడు సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు […]</p>

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల పరిధిలో భూ యాజమానిని బెదిరింపులకు గురిచేసిన కేసులో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురెడ్డి వంశీధర్ అనే వ్యక్తికి సంబంధించిన భూమిలోకి శ్రీరాంపూర్‌కు చెందిన సల్లూరి శంకర్ అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఈ భూమి తనదని వాదించాడు. అంతటితో ఆగకుండా అట్రాసిటీ కేసు పెడుతానని బెదిరించి తన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు.
దీంతో బాధితుడు సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి సల్లూరి శంకర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు నస్పూర్ సీఐ సంజీవ్ తెలిపారు. ఇతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని, ఇంకా ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిందితుడిపై నిఘా కోసం ల్యాండ్ బర్ షీట్ కూడా తెరవడం జరుగుతుందన్నారు. ప్రజలు ఇలాంటి వ్యక్తులతో ఎలాంటి అసౌకర్యానికి గురైనా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు.






