17మంది యువతులను నమ్మించి…

by  |
17మంది యువతులను నమ్మించి…
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: భారత సైన్యంలో పనిచేస్తున్నానని చెప్పి, పెళ్లి పేరిట 17మంది యువతుల నుంచి రూ.6.61కోట్లు వసూలు చేసిన గుంటూరు జిల్లాకు చెందిన శ్రీను నాయక్‌ అలియాస్ శ్రీనివాస్ చౌహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జవహార్‌నగర్‌లో ఇల్లు, వాహనం కొనుగోలు చేసి దర్జాగా మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని కటకటాల్లోకి పంపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2014లో గుంటూరు జిల్లా నుంచి సైనిక్‌పురి వచ్చిన శ్రీనివాస్.. ఆధార్‌కార్డులో పుట్టిన సంవత్సరాన్ని 1979కి బదులు 1986గా మార్చుకొని, ఆర్మీలో అధికారిగా పనిచేస్తున్నానంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టాడు.

ఇదేక్రమంలో తన ఫోటోలను వివాహ పరిచయ వేదికలకు సైతం ఇచ్చి యువతులను మోసం చేశాడు. అంతేగాక మేఘాలయ సీఎంజే విశ్వవిద్యాలయం నుంచి ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన నకిలీ పట్టాతో పాటు, పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్‌గా పరిచయం చేసుకుంటూ యువతులను పెళ్లి పేరిట మోసం చేశాడు. ఇదేక్రమంలో శ్రీనివాస్‌ మోసాలను ప్రశ్నించిన పలువురు యువతులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే శ్రీనివాస్ 9వ తరగతి వరకే చదివి.. డిస్టెన్స్ పీజీ పట్టా పొందినట్లు విచారణలో తేలింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed