తొలి టెస్టులో వెస్టిండీస్‌పై శ్రీలంక విజయం

76

దిశ, స్పోర్ట్స్: గాలే వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక 187 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 386 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 230 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో శ్రీలంకకు తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగుల ఆధిక్యత లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 191/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. 348 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు నాలుగో రోజు కేవలం 52 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ నిలకడగా ఆడింది. తొలి సెషన్‌లో ఒక వికెట్ కోల్పోయి 73 పరుగులు జోడించారు. లంచ్ విరామం తర్వాత వెస్టిండీస్ జట్టు పెద్దగా పరుగులు జోడించలేదు. మరో 25 పరుగులు జోడించిన అనంతరం వెస్టిండీస్ జట్టు 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో వెస్టిండీస్‌పై శ్రీలంక 187 తేడాతో గెలిచింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ కూల్చడంలో శ్రీలంక స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. లసిత్ ఎంబుల్దనియా 5 వికెట్లతో చెలరేగిపోగా.. రమేష్ మెండిస్ 4 వికెట్లు తీశాడు. సెంచరీతో అదరగొట్టిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..