- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
జగ్గూ భాయ్ బాటలో శ్రీకాంత్
దిశ, వెబ్‌డెస్క్: విలన్ నుంచి హీరోగా మారి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన శ్రీకాంత్… మళ్లీ విలన్‌గా మారనున్నాడు. హీరో జగపతి బాబును ఫాలో అవుతూ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. జగ్గూభాయ్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్రేక్ ఇచ్చిన బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్‌నే పునాది చేసుకోబోతున్నాడు. ఈ మధ్య శ్రీకాంత్ నుంచి వచ్చిన సినిమాలు జనాన్ని ఆకట్టుకోలేక పోయాయి. ఎంత వైవిధ్యంగా నటించినా సినిమా జనాలకు చేరలేకపోయింది. దీంతో విలనిజంకే ఓటేస్తున్నాడు శ్రీకాంత్. బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న చిత్రంలో కరుడుగట్టిన విలన్‌గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం ఫుల్‌గా వర్కౌట్ చేసి బాడీ పెంచేసిన శ్రీకాంత్‌ను చూసి.. హీరో, డైరెక్టర్ ఆశ్చర్యపోయారట. శ్రీకాంత్ డెడికేషన్ లెవల్స్‌కు ఫిదా అయిపోయిన బాలయ్య, బోయపాటి.. ఈ సినిమాతో శ్రీకాంత్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోవడం ఖాయమంటున్నారట.
కాగా బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో సినిమాకు ఇంతకు ముందు కమెడియన్ సునీల్‌ను విలన్‌గా ఎంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. ‘డిస్కో రాజా’ సినిమాలో సునీల్ విలనిజాన్ని చూసి బాలయ్యకు విలన్‌గా సెలక్ట్ చేశారని ఫిల్మ్ నగర్‌లో టాక్ వచ్చినా.. శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్‌గా ఆల్మోస్ట్ కన్‌ఫాం అయినట్లు తెలుస్తోంది.
Tags: Srikanth, Balakrishna, Jagapathi Babu, Boyapati Seenu, Villain