శ్మశాన వాటికల పేరుతో భూములు లాక్కుంటారా : శ్రీధర్ బాబు

by  |
శ్మశాన వాటికల పేరుతో భూములు లాక్కుంటారా : శ్రీధర్ బాబు
X

దిశ, కాటారం : పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికల పేరిట ప్రభుత్వం పేద ప్రజలకు చెందిన భూములను బలవంతంగా తీసుకుంటోందని మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలను, శ్మశానవాటికలను నిర్మించండి. అందుకోసం ప్రభుత్వ భూములు కేటాయించాలి.

అలా కాకుండా అభివృద్ధి పేరిట ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిని పేదల నుంచి లాక్కోవడం సరైన చర్య కాదని శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం అడువాలపల్లి గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి చేపట్టిన దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాలకు అమలు చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గ్రామ పంచాయతీల వికాసానికి తోడ్పడేందుకు పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రస్తుతం మంజూరు చేస్తున్న 16 లక్షలు సరిపోవడం లేదని, అవసరం మేరకు ఈ నిధులను ఇంకా పెంచాలని కలెక్టర్‌ను, ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాలలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రత్యేక నిధులను కేటాయించాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రెండు గుంటల భూమిని ఇచ్చిన భూ దాత సుధాకర్ రావు దాతృత్వాన్ని శ్రీధర్ బాబు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు మల్హాల్ రావు, సర్పంచ్ రాజు నాయక్, ఎం విక్రమ్, మొండయ్య, సుమలత, కాంగ్రెస్ నాయకులు చంద్రునాయక్, రాహుల్ పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed