- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుద్దీపకాంతుల్లో శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం
<p>దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతి తెప్పోత్సవాల్లో భాగంగా ఐదోరోజు బుధవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీగోవిందరాజస్వామి వారు తెప్పలపై విహరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులను కనువిందు చేశారు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతి తెప్పోత్సవాల్లో భాగంగా ఐదోరోజు బుధవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీగోవిందరాజస్వామి వారు తెప్పలపై విహరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై విహరించి భక్తులను కనువిందు చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ వెంకటాద్రి, శ్రీ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కామరాజు, శ్రీ మునీంద్రబాబు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







