అంగరంగ వైభంగా శ్రీ అరబిందో జయంతి ఉత్సవాలు..

by Shyam |   (  Updated:2021-11-13 05:29:12  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : శ్రీ అరబిందో 150 జయంతి ఉత్సవాలను అంగరంగ వైభంగా నిర్వహించడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ టీమ్ సిద్ధమైంది. ఇందులో జర్నలిస్టులను భాగస్వాములుగా చేయాలని కార్యాచరణను సిద్ధం చేసింది. స్వాతంత్ర్య ఉద్యమంలో దేశ ప్రజలకు తన బోధనలతో ప్రభావితం చేసిన శ్రీ అరబిందో గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఇదొక సదావకాశం అని తెలిపింది. ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులకోసం నవంబర్ 14, ఆదివారం ఉదయం 9:30 నుంచి [&hellip;]</p>

అంగరంగ వైభంగా శ్రీ అరబిందో జయంతి ఉత్సవాలు..
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ అరబిందో 150 జయంతి ఉత్సవాలను అంగరంగ వైభంగా నిర్వహించడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ టీమ్ సిద్ధమైంది. ఇందులో జర్నలిస్టులను భాగస్వాములుగా చేయాలని కార్యాచరణను సిద్ధం చేసింది. స్వాతంత్ర్య ఉద్యమంలో దేశ ప్రజలకు తన బోధనలతో ప్రభావితం చేసిన శ్రీ అరబిందో గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఇదొక సదావకాశం అని తెలిపింది. ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులకోసం నవంబర్ 14, ఆదివారం ఉదయం 9:30 నుంచి 1:30 వరకు, అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్, విద్యానగర్, హైదరాబాద్‌ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక వేత్తలు, సామాజిక సేవా కార్యకర్తలు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొంటున్నారని తెలిపారు.

Next Story