- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సన్ రైజర్స్ అభిమానులకు శుభవార్త..
<p>దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఇది నిజంగా సంతోషకరమైన వార్తే. భారత జట్టుతో జరిగిన సిరీస్‌లో గాయపడి క్రికెట్‌కు దూరమైన వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడతాడా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అతడికి కనీసం 6 నెలల విశ్రాంతి అవసరమనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటన్నింటికీ డేవిడ్ వార్నర్ బ్యాటుతో జవాబిచ్చాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్.. గురువారం టాస్మానియాపై సెంచరీ చేశాడు. […]</p>

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఇది నిజంగా సంతోషకరమైన వార్తే. భారత జట్టుతో జరిగిన సిరీస్‌లో గాయపడి క్రికెట్‌కు దూరమైన వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడతాడా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అతడికి కనీసం 6 నెలల విశ్రాంతి అవసరమనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటన్నింటికీ డేవిడ్ వార్నర్ బ్యాటుతో జవాబిచ్చాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్.. గురువారం టాస్మానియాపై సెంచరీ చేశాడు. మార్ష్ కప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లలో వరుసగా 87, 24, 69, 108 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ చేసే క్రమంలో నేను అసౌకర్యానికి ఏమీ గురవ్వలేదు. రాబోయే చాలెంజ్‌ల కోసం ఎదురు చూస్తున్నాను’ అని చెప్పాడు. వార్నర్ తప్పకుండా ఐపీఎల్ ఆడాలని భావిస్తున్నట్లు అతడి మాటల్లో స్పష్టంగా తెలుస్తున్నది.






