- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓ విద్యార్థిని కలెక్టర్ అయిన వేళ !
<p>దిశ, ఏపీ బ్యూరో: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బాలికలకు ఒకరోజు పదవీ బాధ్యతలను అప్పగించారు. ‘బాలికే భవిష్యత్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాల్లో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న […]</p>

దిశ, ఏపీ బ్యూరో: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బాలికలకు ఒకరోజు పదవీ బాధ్యతలను అప్పగించారు. ‘బాలికే భవిష్యత్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాల్లో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఎం.శ్రావణి ఎంపికైంది. జిల్లా కలెక్టర్‌గా ఆ బాలిక బాధ్యతలను నిర్వహించింది. చీరకట్టులో వచ్చిన శ్రావణి కలెక్టర్ కుర్చీలో కూర్చోగా పక్కనే చంద్రుడు చేతులు కట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బాలికే విధులు నిర్వహించింది. అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన వారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయాలని కలెక్టర్ చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తామంటే వారికి అవకాశం కల్పించాలని ఆదేశించారు.






