- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zaheer Khan: 46ఏళ్ల వయసులో తండ్రైన టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్
Zaheer Khan: టీమ్ ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: Zaheer Khan: టీమ్ ఇండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య సాగరిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈవిషయాన్ని సాగరిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నారికి ఫతే సిన్హ్ ఖాన్ అని నామకరణం చేసినట్లు తెలిపారు.
"ప్రేమ, కృతజ్ఞత, దైవ ఆశీర్వాదాలతో మేము మా చిన్న బాబు ఫతేసిన్హ్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాము" అంటూ సాగరిక రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ జంట ఓ అందమైన ఫొటోను కూడా షేర్ చేశారు. ఫొటోలో జహీర్ ఖాన్ తన బిడ్డను తన ఒడిలో పట్టుకుని ఉండగా..సాగరిక తన చేతులను జహీర్ భుజాల చుట్టూ ఉంచింది.
తొలి బిడ్డకు స్వాగతం పలికి ఈ జంటకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా 2016లో తోటి క్రికెటర్ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ సింగ్ వివాహం సందర్భంగా సాగరిక, జహీర్ ఖాన్ తమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2017లో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు.






