సపోర్ట్ దొర‌క‌లేదు, టార్చ‌ర్ అనుభ‌వించా.. రిటైర్మెంట్‌పై యువ‌రాజ్ కామెంట్స్‌

by velandi.Saikiran |   (  Updated:2026-01-29 13:31:16  IST  )

సానియా మీర్జా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నాడు యువరాజ్ సింగ్.

సపోర్ట్ దొర‌క‌లేదు, టార్చ‌ర్ అనుభ‌వించా.. రిటైర్మెంట్‌పై యువ‌రాజ్ కామెంట్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత జట్టులో ఒకప్పుడు అగ్ర క్రికెటర్ గా కొనసాగాడు యువరాజ్ సింగ్. ఒంటి చేత్తో ఎన్నో విజయాలు కూడా ఇండియాకు అందించాడు. టీ20 ప్రపంచ కప్ 2007 సమయంలో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి, చరిత్ర సృష్టించాడు. అయితే అలాంటి మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిటర్మెంట్ సమయంలో తనకు ఎవరు సరిగ్గా సపోర్ట్ చేయలేదని.. దానివల్ల టార్చర్ అనుభవించి రిటైర్మెంట్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సానియా మీర్జా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నాడు యువరాజ్ సింగ్.

రిటైర్మెంట్ పై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత జట్టులో కొనసాగడం ఎంతో అదృష్టం అని వెల్లడించారు యువరాజ్. కెరీర్ చివరలో ఆటను ఆస్వాదించలేకపోయానని పేర్కొన్నారు. తనకు సరైన మద్దతు, గౌరవం లభించలేక అనేక ఇబ్బందులు పడ్డానని వివరించారు. అలాంటి సమయంలో ఎందుకు భారత జట్టు తరఫున ఆడాలి ? అనే ప్రశ్న తనకు వచ్చిందని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎంత నిరూపించుకున్నప్పటికీ, తక్కువే అయింది.. శారీరకంగా, మానసికంగా ఇంతకుమించి చేయలేనైనా భావన వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చినట్లు వెల్లడించారు యువరాజ్. రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా బాధపడినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Similar News : న్యూ రోల్ అంటూ రోహిత్ శ‌ర్మ పోస్ట్‌..మ‌ళ్లీ వ‌న్డే కెప్టెన్సీ ఇస్తున్నారా ?

Next Story