- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ రోల్ అంటూ రోహిత్ శర్మ పోస్ట్..మళ్లీ వన్డే కెప్టెన్సీ ఇస్తున్నారా ?
వన్డేల్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టేటస్ పెట్టుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎన్నో రికార్డులు సాధించాడు. ఇండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు కూడా అందించిన ఘనత రోహిత్ శర్మకు ఉంది. అలాంటి రోహిత్ శర్మ టెస్టులతో పాటు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. 2027 వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
న్యూ రోల్ లోడింగ్ అంటూ రోహిత్ శర్మ పోస్ట్
వన్డేల్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టేటస్ పెట్టుకున్నాడు. కొత్త పాత్ర తనకు రాబోతోంది.. లీడ్ ఇండియా.. రేపు మధ్యాహ్నం వరకు ఆగండి... ఆ పాత్ర ఏంటో తెలిసిపోతుంది అంటూ రోహిత్ శర్మ ఇందులో రాసుకొచ్చాడు. ఈ తరుణంలో రోహిత్ శర్మ స్టేటస్ వైరల్ గా మారింది. ఇది చూసిన రోహిత్ శర్మ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. రోహిత్ శర్మకు మళ్లీ వన్డే కెప్టెన్సీ ఇవ్వబోతున్నారని, ఇదే విషయాన్ని స్టేటస్ రూపంలో హిట్ మ్యాన్ చెప్పినట్లు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగితేనే ఇండియా గెలుస్తుందని అంటున్నారు. అయితే, రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి పెట్టలేదని.. వేరే ప్రోడక్ట్ గురించి ఈ స్టేటస్ పెట్టినట్లు మరి కొంతమంది అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే రేపు మధ్యాహ్నం వరకు ఆడాల్సిందే.






