- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఆలోచన లేదన్న యువరాజ్ సింగ్
by Harish |
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు.

X
దిశ, స్పోర్ట్స్ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. శుక్రవారం ఎక్స్ వేదికగా యువీ క్లారిటీ ఇచ్చాడు. ‘నేను గురుదాస్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ప్రతిభ కలిగిన వారికి సహాయం చేయడం, మద్దతుగా ఉండటం గురించే ఆలోచిస్తున్నా. నా ఫౌండేషన్ ద్వారా ఆ పనులు చేస్తాను.’ అని యువీ రాసుకొచ్చాడు.
ఇటీవల యువరాజ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశాడు. అప్పటి నుంచి అతను బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి యువీ ఎన్నికల బరిలో ఉండనున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా యువరాజ్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు తెరపడినట్టైంది.
- Tags
- #Yuvraj Singh
Next Story






