వన్డే ప్రపంచకప్‌‌‌లో ఓపెనర్‌గా అతడికి అవకాశం ఇవ్వండి: Yuvraj Singh

by Hajipasha |   (  Updated:2022-12-07 06:58:24  IST  )

టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ బ్యాటర్ శుభ్‌ మాన్ గిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వన్డే ప్రపంచకప్‌‌‌లో ఓపెనర్‌గా అతడికి అవకాశం ఇవ్వండి: Yuvraj Singh
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ బ్యాటర్ శుభ్‌ మాన్ గిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎవరు ఓపెనింగ్ చేస్తారనే చర్చ క్రికెట్ అభిమానులలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వన్డే ఫార్మట్‌కు రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఓపెనర్లను దిపేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. 2023 వన్డే ప్రపంచకప్‌లో గిల్‌కు ఓపెనింగ్‌గా అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. వన్డే‌ మ్యాచ్‌లో అతడు చాలా బాగా రాణిస్తున్నాడని, అతని ఫామ్ కూడా అద్భుతంగా ఉందని అన్నాడు. ప్రపంచ కప్ వన్డే ఫార్మట్‌లో గిల్ బలమైన పోటీదారుడుగా తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాక జట్టులో స్థానం కోసం బాగా కష్టపడుతున్నాడని, రాబోయే రోజుల్లో టీమిండియాకు టాలెంటెడ్ ప్లేయర్‌గా మారుతాడని యువరాజ్ చెప్పుకోచ్చాడు.

Next Story