- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
U-23 ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో ఒకే రోజు ఐదు బంగారు పతకాలు
అండర్-23 ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్లు సత్తాచాటారు.

దిశ, స్పోర్ట్స్ : వియత్నంలో జరుగుతున్న అండర్-23 ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్లు సత్తాచాటారు. గురువారం ఒక్క రోజే ఐదు బంగారు పతకాలు దక్కాయి. ఉమెన్స్ రెజ్లింగ్‌లో 50 కేజీల కేటగిరీలో ప్రియాన్షి ప్రజాపత్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో మంగోలియా బాక్సర్ ముంఖ్‌బట్‌ను 4-2తో ఓడించింది. 55 కేజీల కేటగిరీలో రీనా 13-4 తేడాతో అరుకె కాడిర్బెక్‌ను చిత్తు చేసి స్వర్ణం సాధించింది. 68 కేజీల కేటగిరీలో శ్రిష్టి కూడా బంగారు పతకం గెలిచింది. ఫైనల్‌లో ఆమె 10-0తో చైనా రెజ్లర్ యుకీ లియుపై ఏకపక్ష విజయం సాధించింది. 76 కేజీల కేటగిరీలో ప్రియా కూడా స్వర్ణం గెలవగా.. 59 కేజీల కేటగిరీలో తన్వి గుండేశ్ రజతం సాధించింది. గ్రీకో రోమన్ విభాగంలో 63 కేజీల కేటగిరీలో సుమిత్ గోల్డ్ మెడల్ గెలిచాడు. బుధవారం గ్రీకో రోమన్ కేటగిరీలో అంకిత్ గులియా(72 కేజీలు), నితేశ్ సివాచ్(97 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు.






