- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదేం హాలీడే కాదు.. బీసీసీఐ ‘నో ఫ్యామిలీ’ రూల్‌కు గంభీర్ మద్దతు
by Phanindra |
బీసీసీఐ ‘నో ఫ్యామిలీ’ రూల్‌కు గంభీర్ మద్దతిచ్చాడు. టీమిండియాకు ఆడటమంటే హాలీడే కాదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

X
దిశ, స్పోర్ట్స్: విదేశీ టూర్లకు ప్లేయర్ల కుటుంబ సభ్యులను తీసుకెళ్లడంపై బీసీసీఐ నిబంధనలను హెడ్ కోచ్ గౌతం గంభీర్ సమర్థించాడు. ఈ విషయంలో బీసీసీఐపై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పుజారాతో మాట్లాడిన గంభీర్.. ‘ఫ్యామిలీస్ ముఖ్యమే. కానీ మనం ఒక కారణంతో వచ్చామనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇదేం హాలీడే కాదు. ఆ డ్రెస్సింగ్ రూంలో అడుగు పెట్టాలని ఎంతో మంది అనుకుంటారు. కానీ చాలా కొద్దిమందికే దేశం గర్వపడేలా చేసే ఆ ఛాన్స్ దక్కుతుంది. సో, కుటుంబాలు వద్దనే నిర్ణయాన్ని నేను వ్యతిరేకించను. దేశం గర్వపడేలా చేయాలనే లక్ష్యంపై మన ఫోకస్ ఉండి, దానికే ప్రాధాన్యం ఇస్తే.. మిగతాదంతా ఓకే అని నా ఫీలింగ్. అయితే మిగతా విషయాలన్నింటి కన్నా కూడా దేశం కోసం ఆడటం, ఎందుకు వాడుతున్నామనే గోల్ చాలా ముఖ్యం’ అని చెప్పాడు.
Next Story






