యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. వన్డేల్లో ఇదే ఫస్ట్

by Gantepaka Srikanth |

యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. వన్డేల్లో ఇదే ఫస్ట్

యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ.. వన్డేల్లో ఇదే ఫస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) అదరగొట్టారు. సౌతాఫ్రికాతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీతో రాణించారు. ఒక సిక్స్, పది ఫోర్లతో కేవలం 111 బంతుల్లోనే సెంచరీ చేశారు. వన్డే ఫార్మాట్‌లో జైస్వాల్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అంతకుముందు రోహిత్ శర్మ కూడా అద్భుతంగా రాణించారు. 73 బంతుల్లో 75 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్‌తో విరాట్ కోహ్లీ(34 పరుగులు) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. టాస్ గెలిచిన టీమ్ఇండియా సఫారీలకు తొలుత బ్యాటింగ్ అప్పగించింది. సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (106) సెంచరీ బాదాడు. టెంబా బావుమా (48) రాణించాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్‌ కృష్ణ 4, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

Next Story