- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
England vs India: సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్
ఇంగ్లండ్(England)లోని లీడ్స్ మైదానం వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో భారత(India) బ్యాట్స్‌మెన్‌లు అదరగొడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్(England)లోని లీడ్స్ మైదానం వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులో భారత(India) బ్యాట్స్‌మెన్‌లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సెంచరీతో సత్తా చాటారు. 152 బంతుల్లోనే సెంచరీ(100) చేశాడు. ఇందులో 16 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం 74 బంతుల్లో 58 పరుగుల వద్ద కొనసాగుతున్నాడు. అంతకుముందు మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా గౌరవప్రదమైన ఇన్సింగ్స్ ఆడాడు. 78 బంతుల్లో 42 పరుగులు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా ప్రస్తుతం.. 51 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీ స్కోరు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, స్టోక్స్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. గత పదేళ్లలో ఇండియా టెస్ట్ టీమ్‌కు ఐకాన్లుగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా తొలిసారి యువ జట్టు బరిలోకి దిగింది.






