- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్మెంట్ ప్రకటించిన WWE స్టార్
డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ప్లేయర్ జాన్ సీనా రిటైర్మెంట్ ప్రకటించారు. జాన్ సీనా రెండు దశాబ్దాలకు పైగా రెజ్లింగ్ ప్రపంచంలో రాణించారు.

దిశ, వెబ్ డెస్క్: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ప్లేయర్ జాన్ సీనా రిటైర్మెంట్ ప్రకటించారు. జాన్ సీనా రెండు దశాబ్దాలకు పైగా రెజ్లింగ్ ప్రపంచంలో రాణించారు. ఇప్పటికు వరకు జాన్ సీనా 17సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ సాధించారు. ఇక ఈ నెల 13న రెజ్లింగ్ లో జాన్ సీనా ప్రయాణం చివరి రోజు కానుంది. ఈ నేపథ్యంలో లాస్ట్ టైమ్ ఈజ్ నౌ అనే పేరుతో డబ్ల్యూడబ్ల్యూఈ ఫేరవెల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో జాన్ తన చివరి మ్యాచ్ ఆడనున్నారు.
ఇదిలా ఉంటే జాన్ సీనా రెజ్లింగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నాడు. నైన్టీస్ నుండి 2కే కిడ్స్ వరకు జాన్ సీనాకు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆయన కిక్ స్టైల్, ఎంట్రీ విధానం ప్రేక్షకులను ఫిదా చేసే విధంగా ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూఈలో రాణిస్తూనే ఆయన సినిమాల్లోనూ నటించారు. అనేక సూపర్ హిట్ సినిమాల్లో ప్రధాన పాత్రలో కనిపించారు. తాజాగా ఆయన రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు భావోద్వేగానికి గువుతున్నారు.






