- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముచ్చటగా మూడోసారి.. 70 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న WWE స్టార్

X
దిశ, వెబ్‌డెస్క్: WWE స్టార్ హల్క్ హోగన్(70) ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో తన ప్రేయసి స్కై డైలీని సహచరులు, కుటుంసభ్యుల నడుమ ఘనంగా వివాహమాడారు. ఈ వివాహ వేడుకలో దంపతులిద్దరూ 5 లక్షల డాలర్ల విలువైన డైమండ్ రింగులను మార్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హోగన్ టోపితో సహా అన్ని నల్లని దుస్తులే ధరించి అందంగా ముస్తాబవ్వగా.. వధువు స్కై డైలీ తెల్లటి స్ట్రాప్‌లెస్ గౌనులో కనిపించింది. స్కై డైలీకి కూడా ఇది మూడో వివాహం. ఆమెకు ఇది వరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం హోగన్ యోగా శిక్షకుడిగా పని చేస్తుండగా.. స్కై డైలీ అకౌంటెంట్‌గా పని చేస్తోంది. హల్క్ హోగన్ 1980లలో అత్యంత ప్రజాదరణ పొందిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ గా పేరు పొందారు.
Next Story






