'యశస్వీ జైశ్వాల్‌ జాక్‌పాట్‌'.. అతడి ప్లేస్‌లో WTC ఫైనల్‌కు ఎంపిక!

by Disha Web Desk 13 |
యశస్వీ జైశ్వాల్‌ జాక్‌పాట్‌.. అతడి ప్లేస్‌లో WTC ఫైనల్‌కు ఎంపిక!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్‌ ఇండియా యువ క్రికెటర్‌ యశస్వీ జైశ్వాల్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఎంపికయ్యాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ స్థానంలో బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. స్టాండ్‌బై ఓపెనర్‌గా అతడు లండన్‌ విమానం ఎక్కనున్నాడు. ప్రస్తుతం రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్‌ మ్యాచులో తలపడనున్నాడు. జూన్‌ 3న అతడు పెళ్లి చేసుకుంటుండంతో.. జూన్‌ 5 తర్వాతే టీమ్‌ ఇండియాకు అందుబాటులో ఉంటాడు. అయితే ప్రిపరేషన్‌కు టైమ్‌ లేకపోవడంతో యూకే వీసా ఉన్న యశస్వీ జైశ్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. మరో రెండు రోజుల్లో అతడు లండన్‌ వెళ్తాడు.

ఐపీఎల్‌ 2023లో యశస్వీ జైశ్వాల్‌ అదరగొట్టాడు. ఈ సీజన్ ఆడిన 14 మ్యాచుల్లో 625 పరుగులు సాధించాడు. ఇందుల్లో 1 సెంచరీ, 5 హాఫ్‌ సెంచరీలు బాదేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. 15 మ్యాచుల్లో 80.21 సగటుతో 9 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీలు బాదాడు. 1845 పరుగులు సాధించాడు. టీమ్‌ ఇండియా జూన్‌ 7 నుంచి 11 వరకు ఓవల్‌ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడనుంది. అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.


Next Story

Most Viewed