- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్నిస్ క్రీడాకారిణులకు పెయిడ్ మెటర్నిటీ లీవ్
మహిళా టెన్నిస్ క్రీడాకారిణులకు ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్(డబ్ల్యూటీఏ) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : మహిళా టెన్నిస్ క్రీడాకారిణులకు ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్(డబ్ల్యూటీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ టెన్నిస్ టూరులో ఆడుతున్న మహిళా క్రీడాకారిణులు గర్భం దాలిస్తే వారికి 12 నెలలపాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(పీఐఎఫ్)తో కలిసి డబ్ల్యూటీఏ మెటర్నిటీ ఫండ్ ప్రొగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా డబ్ల్యూటీఏ ప్లేయర్లు సంతానోత్పత్తి చికిత్స, ఇతర ప్రయోజనాలకు ఆర్థిక మద్దతు లభించనుంది.
అలాగే, సరోగసి లేదా దత్తత ద్వారా అమ్మగా మారిన వారు రెండు నెలలపాటు వేతనంతో కూడిన సెలవులు పొందచ్చు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అథ్లెట్స్ కూడా మెటర్నిటీ బెనిఫిట్స్ పొందొచ్చని డబ్ల్యూటీఏ పేర్కొంది. డబ్ల్యూటీఏ క్రీడాకారిణులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ ప్రొగ్రాం ద్వారా 300 కంటే ఎక్కువ మంది ప్లేయర్లకు ప్రయోజనం కలుగుతుందని డబ్ల్యూటీఏ సీఈవో పోర్షియా ఆర్చర్ తెలిపారు. మాతృత్వం, కుటుంబ జీవితంతో ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌ను సమతుల్యం చేయడం సవాల్‌గా ఉంటుందని, ఆటగాళ్లకు తమకు నచ్చిన సమయంలో తల్లిదండ్రులు కావడానికి మద్దతు ఇచ్చేందుకు ఈ ప్రొగ్రాంను ముందుకు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. సెరెనా విలియమ్స్(అమెరికా), నవోమి ఒసాకా(జపాన్), విక్టోరియా అజరెంకా(బెలారస్)లతోపాటు పలువురు క్రీడాకారుణులు మాతృత్వం తర్వాత కూడా టెన్నిస్ కోర్టులోకి తిరిగివచ్చారు.






