'నిరసనను ప్రపంచ వ్యాప్తం చేస్తాం'.. భారత రెజ్లర్లు కీలక నిర్ణయం

by Disha Web Desk 13 |
నిరసనను ప్రపంచ వ్యాప్తం చేస్తాం.. భారత రెజ్లర్లు కీలక నిర్ణయం
X

న్యూఢిల్లీ: ఇన్ని రోజులు ప్రభుత్వానికి, పెద్దలకు విజ్ఞప్తులు చేసిన భారత రెజ్లర్లు ఇక హెచ్చరికలకు దిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్‌ బ్రిజ్ భూషణ్‌ను మే 21లోగా అరెస్టు చేయకపోతే ఈ నిరసన ఉద్యమాన్ని ప్రపంచ వ్యాప్తం చేస్తామని హెచ్చరించారు. మైనర్‌తో సహా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని భారత అగ్రశ్రేణి రెజ్లర్లు గత 23 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మేము ఈ నిరసనను ప్రపంచ వ్యాప్తం చేస్తాం. ఇతర దేశాల ఒలింపియన్లు, పతక విజేతలను సంప్రదిస్తాం. వారి మద్దతు కోరుతూ లేఖ రాస్తాం.

మా నిరసనను భగ్నం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆందోళన ఆరంభంలో ఇది జరిగింది. మమ్మల్ని వెంబడిస్తున్నారు. రికార్డ్ చేస్తున్నారు. ఫోటోలు తీస్తున్నారు. వద్దన్నా వినడం లేదు. కొంత మంది గుర్తు తెలియని మహిళలు ఇక్కడ టెంట్ లోపల నిద్రించడనికి ప్రయత్నించారు. మాకు తెలియని స్త్రీలను రాత్రిపూట లోపలికి పంపుతున్నారు. ఏదైనా జరిగితే న్యాయం కోసం పోరాడుతున్న మా ఉద్యమానికి చెడ్డ పేరు వస్తుంది’ అని వినేష్ పొగట్ చెప్పింది. రెజ్లర్లు నిరసన స్థలానికి మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని ప్రతి పౌరునికి తమ కష్టాలను తెలియజేసే ప్రయత్నం చేస్తారని ఆమె వెల్లడించింది.

Also Read..

IPL 2023: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్..


Next Story

Most Viewed