మహేష్ బాబు- మంజుల రేర్ వీడియో వైరల్.. వెరీ క్యూట్ అంటూ కామెంట్స్

by Disha Web Desk 9 |
మహేష్ బాబు- మంజుల రేర్ వీడియో వైరల్.. వెరీ క్యూట్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జక్కన్న-సూపర్‌స్టార్ కలయికలో మొదటిసారిగా మూవీ తెరకెక్కుతుండటంతో ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ బాబు ఈ మూవీ కోసం జుట్టు పెంచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారీ వర్కౌట్స్ చేస్తూ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. అయితే ఈ క్రమంలో సూపర్ స్టార్ హైదరాబాదులో జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో మహేష్‌ బాబును చూసిన సోదరి మంజుల ఆటపట్టించింది. తమ్ముడికి వస్తుండగా ఎదురెళ్లి ప్రేమగా పలకరించింది. తర్వాత ఈ జుట్టు ఏంటి? ఇంతలా పెంచేశావ్ అన్నట్లుగా సరదాగా ప్రిన్స్ జుట్టును పట్టుకుని తెగ నవ్వేస్తుంది. అక్కాతమ్ముళ్లు కాసేపు సరదాగా మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వీక్షించిన సూపర్ ఫ్యాన్స్ బ్రదర్-సిస్టర్ బాండింగ్.. సో క్యూట్ అంటూ మురిసిపోతున్నారు.

Next Story

Most Viewed