- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL : సంచలన నిర్ణయం తీసుకున్న యూపీ.. కెప్టెన్ దీప్తిని వేలంలోకి వదిలేసిన ఫ్రాంచైజీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీ యూపీ వారియర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) ఫ్రాంచైజీ యూపీ వారియర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్ దీప్తి శర్మను వేలంలోకి వదిలేసింది. ఈ నెల 27న డబ్ల్యూపీఎల్ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ప్లేయర్ల జాబితాను గురువారం ప్రకటించాయి. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడంలో దీప్తిది కీలక పాత్ర. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన దీప్తిని యూపీ రిలీజ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తమ కెప్టెన్ మెగ్ లానింగ్‌ను రిలీజ్ చేసింది. ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కాకుండా నాట్ స్కివర్ బ్రంట్‌కు మొదటి చాయిస్ ఇవ్వడం గమనార్హం. హర్మన్ కంటే స్కివర్‌కు రూ. కోటి ఎక్కువగా ఇవ్వనుంది. హర్లీన్ డియోల్(గుజరాత్ జెయింట్స్), రేణుక సింగ్(ఆర్సీబీ), ఎక్లోస్టోన్(యూపీ), వొల్వార్ట్(గుజరాత్ జెయింట్స్), సోఫీ డివైన్(ఆర్సీబీ) వంటి స్టార్లతోపాటు తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి కూడా వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫ్రాంచైజీలు గరిష్టంగా ఐదుగురిని రిటైన్ చేసుకునే వీలు ఉంటుంది. ఢిల్లీ, ముంబై జట్లు ఐదుగురిని అంటిపెట్టుకున్నాయి. ఆర్సీబీ నలుగురిని, గుజరాత్ ఇద్దరిని రిటైన్ చేసుకున్నాయి. ఇక, యూపీ కేవలం శ్వేతా సెహ్రావత్‌ను మాత్రమే రిటైన్ చేసుకుంది. దీంతో ఆ జట్టు అత్యధిక పర్సు వాల్యూ రూ.14.5 కోట్లతో వేలంలోకి రానుంది.
ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ప్లేయర్లు
యూపీ వారియర్స్ : శ్వేతా సెహ్రావత్(రూ.50 లక్షలు). మిగిలిన పర్సు వాల్యూ రూ.14.5 కోట్లు
గుజరాత్ జెయింట్స్ : గార్డ్‌నెర్(రూ3.5 కోట్లు), బెత్ మూనీ(రూ.2.5 కోట్లు). మిగిలిన పర్సు వాల్యూ రూ.9 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : స్మృతి మంధాన(రూ.3.5 కోట్లు), రిచా ఘోష్(రూ.2.75 కోట్లు), ఎలిసా పెర్రీ(రూ.2.2 కోట్లు), శ్రేయాంక పాటిల్(రూ.60 లక్షలు). మిగిలిన పర్సు వాల్యూ రూ.6.15 కోట్లు
ముంబై ఇండియన్స్ : నాట్ స్కివర్ బ్రంట్(రూ.3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్(రూ.2.5 కోట్లు), హేలీ మాథ్యూస్(రూ.1.75 కోట్లు) అమన్‌జోత్ కౌర్(రూ.కోటి), కమిలిని(రూ.50 లక్షలు). మిగిలిన పర్సు వాల్యూ రూ.5.75 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్ష్ : జెమిమా రోడ్రిగ్స్(రూ.2.2 కోట్లు), షెఫాలీ వర్మ(రూ.2.2 కోట్లు), సదర్లాండ్(రూ.2.2 కోట్లు), మారిజన్నె కాప్(రూ.2.2 కోట్లు), నికీ ప్రసాద్(రూ.50 లక్షలు). మిగిలిన పర్సు వాల్యూ రూ5.7 కోట్లు
slug : WPL Retentions: Laura Wolvaardt, Deepti Sharma released






