- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL: క్రికెట్ ఫ్యాన్స్ కు అలర్ట్.. రేపు టికెట్స్ రిలీజ్
by velandi.Saikiran |
క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

X
దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన కీలక అప్డేట్ తాజాగా వచ్చింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా జరిగే మ్యాచ్ ల టికెట్లు రేపు రిలీజ్ కానున్నాయి. రేపు సాయంత్రం 6:00 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
WPL అధికారిక వెబ్ సైట్ లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ జనవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నమెంట్ కేవలం రెండు వేదికలలో మాత్రమే నిర్వహిస్తున్నారు. నవి ముంబై, వడోదర వేదికల్లో ఈ సీజన్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్లో భాగంగా మొదట ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఫైట్ జరగనుంది. అంతేకాదు ఈ టోర్నమెంట్లో మొత్తం ఐదు జట్లు పాల్గొననుండగా ఎలిమినేటర్, ఫైనల్ తో కలుపుకొని మొత్తం 20 మ్యాచ్ లు ఉంటాయి.
Next Story






