- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖతార్ ఓపెన్ నుంచి సబలెంక అవుట్
2020లో సబలెంక ఖతర్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం విశేషం. మరో మ్యాచ్‌లో కోకో గాఫ్ ఉక్రెయిన్‌కు చెందిన మార్తా కోస్తిక్ చేతిలో 2-6, 5-7 తేడాతో ఓడిపోయింది.

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నంబర్ 1 మహిళా టెన్నిస్ ప్లేయర్ అరెనా సబలెంక షాకింగ్ ఓటమితో ఖతర్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. రష్యాకు చెందిన ఎకతరీనా అలాగ్జాండ్రోవాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సబలెంక 3-6,6-3,7-6(7/5) తేడాతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్‌లో మాడిసన్ కీస్ మీద ఓడిపోయిన తర్వాత సబలెంక ఆడిన తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. గత వారం లింజ్‌లో జరిగిన టోర్నీలో ఐదో డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి అలెగ్జాండ్రోవా మంచి ఫామ్‌లో ఉంది. ఇక సబలెంకతో జరగిన మ్యాచ్‌లో మొదటి సెట్‌ను కోల్పోయినా.. రెండో సెట్ నుంచి పుంజుకుంది. అయితే మూడో సెట్‌లో సబలెంక గట్టిపోటీ ఇచ్చింది. కానీ టై బ్రేకర్‌లో సబలెంకను అలెగ్జాండ్రోవా 7-5తో ఓడించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలిచింది. 2022లో చివరి సారిగా ఖతర్ ఓపెన్ ఆడిన సబలెంక మళ్లీ మూడేళ్ల విరామం తర్వాత పాల్గొన్నది. 2020లో సబలెంక ఖతర్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం విశేషం. మరో మ్యాచ్‌లో కోకో గాఫ్ ఉక్రెయిన్‌కు చెందిన మార్తా కోస్తిక్ చేతిలో 2-6, 5-7 తేడాతో ఓడిపోయింది.






