స్వరాష్ట్రానికి వరల్డ్ కప్ విన్నర్ శ్రీచరణి.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-07 04:12:08  IST  )

మహిళా వన్డే వరల్డ్ కప్ విన్నర్ శ్రీచరణి ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

స్వరాష్ట్రానికి వరల్డ్ కప్ విన్నర్ శ్రీచరణి.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
X

దిశ వెబ్‌డెస్క్: మహిళా వన్డే వరల్డ్ కప్ విన్నర్ శ్రీచరణి (Sri Charani) ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ మేరకు ఆమెకు రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి, సవిత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మహిళా వన్డే వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించి సత్తా చాటిన విషయం తెలిసిందే. కాగా, ఈ టోర్నీ మొత్తంలో శ్రీచ‌ర‌ణి అద్భుత‌మైన ప్రదర్శనతో అదరగొట్టింది. క‌డ‌ప జిల్లాకు చెందిన శ్రీచ‌ర‌ణి ఫైనల్ మ్యాచ్‌లోనూ బంతితో మ్యాజిక్ చేసింది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రీ చరణి 78 ఓవర్లు వేసి మొత్తం 14 వికెట్లు పడగొట్టింది. దీప్తీ శర్మ తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్ల తీసిన బౌలర్ శ్రీచరణి కావడం విశేషం

Next Story