- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'జింబాబ్వే'లో... మహిళల టీ20 వరల్డ్ కప్?
భద్రత కారణాల దృష్ట్యా.. ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచ కప్ ను ఎక్కడ నిర్వహించబోతున్నారనే విషయం పై రోజురోజుకి సస్పెన్స్ పెరిగిపోతుంది.

దిశ, వెబ్ డెస్క్: భద్రత కారణాల దృష్ట్యా.. ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచ కప్ ను ఎక్కడ నిర్వహించబోతున్నారనే విషయం పై రోజురోజుకి సస్పెన్స్ పెరిగిపోతుంది. టీ20 ని భారత్ లో నిర్వహించాలని బీసీసీఐ ను ఐసీసీ కోరగా.. బీసీసీఐ సెక్రటరీ జైషా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా జింబాబ్వే.. ఈ మెగా ఈవెంట్ ను నిర్వహించడానికి ఆసక్తిని చూపిస్తున్నట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. దీంతో పాటు ఈ రేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ ఈవెంట్ ను నిరాకరించటంతోనే ఇప్పుడు ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా ఇప్పటివరకు జింబాబ్వే మహిళల జట్టు ఏ ప్రపంచకప్ లోనూ పాల్గొనలేదు. గడిచిన 21 ఏళ్లలో జింబాబ్వేలో కూడా క్రికెట్ ప్రపంచకప్ జరగనేలేదు. అయితే జింబాబ్వే చివరిసారిగా 2003 లో కెన్యా, సౌతాఫ్రికాతో కలిసి మెన్స్ వన్డే వరల్డ్ కప్ ను నిర్వహించింది.






