- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వుమెన్స్ వన్డే వరల్డ్ కప్.. భారత్-పాక్ మధ్య ఉత్కంఠ పోరు ఎప్పుడంటే?
2025 వుమెన్స్ వన్డే వరల్డ్ కప్‌కి (Women's ODI World Cup) భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం వహించనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: 2025 వుమెన్స్ వన్డే వరల్డ్ కప్‌కి (Women's ODI World Cup) భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం వహించనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్-పాకిస్తాన్ (India-Pakistan) జట్ల మధ్య ఉత్కంఠ పోరు అక్టోబర్ 5న జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియం (Premadasa Stadium in Colombo) వేదిక కానుంది. కాగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అభ్యర్థన మేరకు, వారు హైబ్రిడ్ మోడల్ ద్వారా టోర్నీలో పాల్గొననున్నారు. దీంతో పాక్ జట్టు తమ అన్ని లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. అందులో భారత్‌తో మ్యాచ్ కూడా ఉంటుంది. కాగా, ఈ వరల్డ్ కప్ సెప్టెంబర్ 30న బెంగళూరులో భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. మొత్తం 28 లీగ్ మ్యాచ్‌లు, 3 నాక్‌ఔట్ మ్యాచ్‌లు ఉంటాయి. సెమీఫైనల్స్ అక్టోబర్ 29, 30వ తేదీన, ఫైనల్ నవంబర్ 2న జరగనుంది. భారత్ vs పాక్ పోరు అభిమానుల్లో గట్టి ఆసక్తిని కలిగిస్తుంది.






