IND VS ENG : ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్.. ఐదో టెస్టు నుంచి స్టార్ బౌలర్ ఔట్

by Harish |

భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌కు భారీ షాక్ తగిలింది.

IND VS ENG : ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్.. ఐదో టెస్టు నుంచి స్టార్ బౌలర్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ క్రిస్ వోక్స్ గాయం కారణంగా మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) శుక్రవారం వెల్లడించింది. వోక్స్ మిగతా మ్యాచ్ ఆడలేడని తెలిపింది. గురువారం ఫీల్డింగ్ చేస్తుండగా వోక్స్‌ గాయపడ్డాడు. 57వ ఓవర్‌లో కరుణ్ నాయర్ ఆడిన బంతిని బౌండరీ లైన్ వద్ద ఆపే క్రమంలో డైవ్ చేయగా అతని ఎడమ భుజానికి గాయమైంది. దీంతో అతను నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చూడగా గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను మైదానం వీడాడు. స్కానింగ్‌లో ఎడమ భుజం డిస్ లోకేట్ అయినట్టు తెలుస్తోంది. వోక్స్ దూరమవడం ఇంగ్లాండ్‌కు భారీ దెబ్బే. ఇప్పటికే బెన్ స్టోక్స్, ఆర్చర్‌ సేవలను కోల్పోయిన ఇంగ్లాండ్ ఐదో టెస్టులో పెద్దగా అనుభవం లేని బౌలర్లు అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్‌లతోనే ఆడనుంది. తొలి రోజు 14 ఓవర్లు్ వేసి వోక్స్ ఒక్క వికెట్ తీశారు. సిరీస్‌లో మొత్తం ఐదు టెస్టుల్లోనూ భాగమైన అతను 11 వికెట్లు తీశాడు.


Next Story