IND VS ENG : భారత్‌తో తలపడే ఇంగ్లాండ్ జట్టు ఇదే

by Harish |

ఇంగ్లాండ్ జట్టు టెస్టు మ్యాచ్‌కు ఒక్క రోజు ముందే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటిస్తుంటుంది.

IND VS ENG : భారత్‌తో తలపడే ఇంగ్లాండ్ జట్టు ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ జట్టు టెస్టు మ్యాచ్‌కు ఒక్క రోజు ముందే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటిస్తుంటుంది. టీమిండియాతో తొలి టెస్టుకు ముందు కూడా ఆ పద్ధతినే కొనసాగించింది. శుక్రవారం నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుండగా బుధవారమే తమ తుది జట్టును ఖరారు చేసింది. సీనియర్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడు. అతని రాకతో లోయర్ బ్యాటింగ్ ఆర్డర్, పేస్ ఎటాక్‌ బలం చేకూరింది. మరో పేసర్ బ్రైడన్ కార్సే తొలిసారిగా సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. అలాగే, ఇటీవల జింబాబ్వేతో ఏకైక టెస్టులో భారీ శతకం(171) బాదిన ఓలీ పోప్‌కు తుది జట్టులో చోటు దక్కింది. దీంతో జాకబ్ బెథెల్ నిరాశ తప్పలేదు. బ్రూక్, కార్సే, జోష్ టంగ్, జేమీ స్మిత్ మొదటిసారిగా భారత్‌తో ఆడబోతున్నారు.

ఇంగ్లాండ్ తుది జట్టు : జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.


Next Story