ఐపీఎల్ టైటిల్ కంటే ఇంగ్లాండ్‌లో గెలవడమే గొప్ప : గిల్

by Harish |

ఐపీఎల్ టైటిల్ గెలవడం కంటే ఇంగ్లాండ్ గెలవడమే గొప్ప విషయమని టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్ టైటిల్ కంటే ఇంగ్లాండ్‌లో గెలవడమే గొప్ప : గిల్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ టైటిల్ గెలవడం కంటే ఇంగ్లాండ్ గెలవడమే గొప్ప విషయమని టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్‌తో తొలిటెస్టుకు ముందు గురువారం అక్కడి మీడియాతో గిల్ మాట్లాడాడు. కెప్టెన్సీ అనేది ఏ ప్లేయర్‌కైనా లభించే అతి పెద్ద గౌరవమన్నాడు. టెస్టు క్రికెట్‌లో దేశానికి నాయకత్వం వహించే అవకాశం అందరికీ రాదని, ఆ చాన్స్ తనకు రావడం సంతోషంగా ఉందని చెప్పాడు.

‘ఐపీఎల్ టైటిలా? ఇంగ్లాండ్‌‌లో టెస్టు సిరీస్ గెలవడమా? ఏది గొప్ప విషయమని భావిస్తారు’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ విజయమే గొప్పదని గిల్ బదులిచ్చాడు. ‘కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌కు రావడానికి ఎక్కువ అవకాశాలు రావు. మీ తరంలో అత్యుత్తమైతే రెండు లేదా మూడోసార్లు ఆ చాన్స్ దక్కొచ్చు. ఐపీఎల్ ప్రతి ఏడాది వస్తుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవడమే గొప్ప విషయం.’అని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ బజ్‌బాల్‌ ఆటతీరుతో భారత్ స్ఫూర్తి పొందుతుందా? అని ఓ జర్నలిస్ట్ అడగ్గా.. ‘మా స్టైల్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే’అని సమాధానమిచ్చాడు.

తాను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతానని తెలిపాడు. ‘విరాట్ భాయ్ రిటైర్డ్ అయిన తర్వాత నేను, గంభీర్ చర్చించాం. గంభీర్ నన్ను 4వ స్థానంలో రావాలని చెప్పాడు. నేనూ అదే స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకున్నా. నేను కెప్టెన్‌ అని అనుకోవడం లేదు. కొన్నిసార్లు అది నాపై ఒత్తిడి తెస్తుంది. బ్యాట్స్‌మెన్‌గానే ఆడాలని, ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాలని, అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే ఆలోచిస్తా.’అని గిల్ చెప్పుకొచ్చాడు.


Next Story