- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫైనల్ అయినా లెక్కచేయం.. మాకు దేశం ముఖ్యం అంటున్న భారత మాజీ క్రికెటర్లు
హల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది.

దిశ, స్పోర్ట్స్ : హల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ఎలాంటి క్రికెట్ సంబంధాలు పెట్టుకోవద్దని దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్‌తో ఆడేందుకు నిరాకరించిన భారత మాజీ క్రికెటర్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. డబ్ల్యూసీఎల్‌లో గ్రూపు దశ మ్యాచ్, సెమీస్ మ్యాచ్‌లను భారత్ చాంపియన్స్ రద్దు చేసుకుంది. పాక్‌తో తలపడాల్సి వస్తే అది ఫైనల్ అయినా ఇదే నిర్ణయం తీసుకుంటామని ఇండియా చాంపియన్స్ వర్గాలు తెలిపాయి. తమకు ఎప్పుడైనా దేశమే ముఖ్యమని పేర్కొన్నాయి. ‘మేము పాకిస్తాన్‌తో ఆడటం లేదు. మా దేశం అన్నింటి కంటే ముఖ్యమైంది. భారత్ కోసం ఏదైనా చేస్తాం. భారత జట్టు సభ్యులుగా గర్వపడుతున్నాం. మా షర్ట్స్‌పై భారత జెండా రావడానికి మేము ఎంతో కష్టపడ్డాం. సాధించాం. ఏదేమైనా దేశాన్ని మనం దేశాన్ని నిరాశపర్చం. భారత్ మాతా కీ జై’ అని భారత మాజీ క్రికెటర్లు తెలిపారు. సెమీస్‌ను భారత ఆటగాళ్లు బహిష్కరించడంతో పాకిస్తాన్ చాంపియన్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది.






