- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో టెస్టు బుమ్రా ఆడతాడా?లేదా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా రెండో టెస్టు ఆడతాడా?లేదా? అన్న దానిపై అనిశ్చితి నెలకొంది.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను మూడు టెస్టులకే పరిమితం చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించిన నేపథ్యంలో అతను రెండో టెస్టు ఆడతాడా?లేదా? అన్న దానిపై అనిశ్చితి నెలకొంది. దీనిపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ స్పందించాడు. అయితే, బుమ్రా ఆడటాన్ని సస్పెన్స్‌లో పెట్టాడు.సోమవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. రెండో టెస్టు ఎంపికకు బుమ్రా అందుబాటులో ఉంటాడని చెప్పాడు. కానీ, తుది జట్టులో చోటుపై ఇప్పుడే చెప్పలేమన్నాడు. చివరి నిమిషంలోనే నిర్ణయం ఉంటుందని తెలిపాడు. ‘బుమ్రా ఆడటానికి సిద్ధంగానే ఉన్నాడు. అతను రెండో టెస్టు ఆడటం తప్పనిసరి అయితే చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటాం. వాతావరణ పరిస్థితులు, పిచ్ స్పందించే తీరు, లార్డ్స్, మాంచెస్టర్, ది ఓవల్ మ్యాచ్‌ల్లో ఏ మ్యాచ్‌లో ఆడించాలి? అనే కారణాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అతని నుంచి ఎక్కువ ప్రయోజనం పొందేలా ఆలోచించాలి. బుమ్రా లేకపోయినా సిరీస్‌ను 1-1తో సమం చేయగలం. రెండో టెస్టును డ్రా చేయగలం. ఏదో ఒక దశలో అతని అవసరం ఉంటుంది. బుమ్రాను ఎప్పుడు వాడుకోవాలో మనకు తెలిసి ఉండాలి. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా వికెట్లు తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అతను వికెట్లు తీయకపోయినా దగ్గరి వరకు వచ్చాం. అయితే, ఒక బౌలర్ రాణించడం వల్ల టెస్టు సిరీస్ గెలవలేం. కానీ, బుమ్రా విషయంలో 48 లేదా 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటాం.’అని ర్యాన్ టెన్ డోస్చాట్ తెలిపాడు.
నితీశ్ ఆడే చాన్స్
రెండో టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి అవకాశాలు ఉన్నాయని టెన్ డోస్చాట్ తెలిపాడు. సెలెక్షన్‌కు అతను దగ్గరగా ఉన్నాడని చెప్పాడు. ‘ఆస్ట్రేలియాలో అతను అద్భుతంగా రాణించాడు. మేము సమతుల్యం కోసం చూస్తున్నాం. అతను మా ప్రీమియర్ ఆల్‌రౌండర్. రెండో టెస్టు ఆడేందుకు ఎక్కువగానే అవకాశాలు ఉన్నాయి.’అని చెప్పాడు. అలాగే, ఇద్దరు స్పిన్నర్లను ఆడించడంపై స్పందిస్తూ.. జడేజాతో స్పిన్ బాధ్యతలు మోయడానికి కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ పోటీపడుతున్నారని తెలిపాడు. అయితే, స్పిన్ ఆల్‌రౌండర్‌ని తీసుకోవాలా?లేదా స్పిన్నర్‌ను తీసుకోవాలా? అని ఆలోచిస్తున్నట్టు చెప్పాడు. అయితే, బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను తీసుకుంటామని పరోక్షంగా వాషింగ్టన్ సుందర్ ఎంపికను ఖరారు చేశాడు.






