కోహ్లీ అంకుల్ అలా ఎందుకు చేశావు?.. విరాట్‌కు మెసేజ్ పెట్టిన హర్భజన్ కూతురు.. కోహ్లీ రిప్లై

by Harish |

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కోహ్లీ అంకుల్ అలా ఎందుకు చేశావు?.. విరాట్‌కు మెసేజ్ పెట్టిన హర్భజన్ కూతురు.. కోహ్లీ రిప్లై
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ నిర్ణయంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు షాక్ గురయ్యారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూతురు హినయ కూడా ఆశ్చర్యపోయిందట. కోహ్లీ ఎందుకు టెస్టులకు వీడ్కోలు పలికాడో తెలుసుకోవాలని విరాట్‌కు మెసేజ్ కూడా చేసిందంట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ తెలిపాడు. ‘కోహ్లీ టెస్టు క్రికెట్‌ నుంచి ఎందుకు తప్పుకున్నావని నేను ట్వీట్ చేశాను. నా కూతురు కూడా‘పప్పా..విరాట్ ఎందుకు రిటైర్ అయ్యాడు?’ అని నన్ను అడిగింది. విరాట్‌కు మెసేజ్ కూడా చేసింది. ‘నేను హినయ. విరాట్ ఎందుకు రిటైర్ అయ్యావు?’ టెక్ట్స్ చేసింది. హినయ మెసేజ్‌కు విరాట్ రిప్లై ఇచ్చాడు. ‘బేటా.. ఇదే సరైన సమయం’అని బదులిచ్చాడు.’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.


Next Story