- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: నేడు ముంబై vs లక్నో మ్యాచ్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) వర్సెస్

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి (Atal Bihari Vajpayee) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా... లక్నో వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్ జరగనుంది. ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఏడు గంటలకు టాస్ వేస్తారు. లక్నో పిచ్ పైన... మొదట బ్యాటింగ్ తీసుకున్న జట్టు గెలిచి అవకాశాలు ఎక్కువగా ఉందని తాజాగా క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇవాల్టి మ్యాచ్ లో టాస్ చాలా కీలకం కానుంది.
ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు... లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) వర్సెస్ ముంబై మధ్య ఆరు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్.. 90 శాతం విజయాలను నమోదు.. చేసింది. ఈ రెండు జట్ల ఆరు మ్యాచ్ లు జరిగితే.... ఏకంగా ఐదు మ్యాచ్ లలో లక్నో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఒకే ఒక్క మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. అంటే ముంబై ఇండియన్స్ పైన కంప్లీట్ గా... లక్నో ఆధిపత్యం చెలాయించింది. ఇక ఇవాళ తమ హోమ్ గ్రౌండ్ లో.. మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్ని నమోదు చేసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. అటు ముంబై ఇండియన్స్ తమ విజయాలను కొనసాగించాలని... ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.






